• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌ దరఖాస్తుకు మరో అవకాశం

ఈనాడు, అమరావతి: ఎంసెట్‌ సహా నాలుగు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగిస్తూ ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. కరోనా కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎస్‌డబ్ల్యూ-3 కింద ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహించేందుకు కళాశాలలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. వాటికి ఎంసెట్‌తో సంబంధం లేకుండా ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తుంది. 

  • Tags