• facebook
  • whatsapp
  • telegram

జేఈఈలో తెలంగాణ విద్యార్థులది అద్భుత ప్రతిభ: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌లో తెలంగాణ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో అభినందనలు తెెలిపారు. భారతదేశంలో 100 శాతం మార్కుల సాధించిన 24 మంది విద్యార్థులలో 8 మంది తెలంగాణ వారు కావడం, బాలికల విభాగంలో చుక్కా తనూజ మొదటి స్థానంలో నిలవడం అద్భుతమని, రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇంటర్‌ పాఠ్యాంశంగా వీహబ్‌ విజయగాథలు
ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం కామర్స్‌ పాఠ్యపుస్తకంలో మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం(వీహబ్‌) విజయగాథలను చేర్చడంపై కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వీహబ్‌ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను విశేషంగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. కామర్స్‌ ఆంగ్లమాధ్యమం పాఠ్యపుస్తకం 114, 115 పేజీల్లో ములుగు, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు రాధికా రాజోజి, సాహిత్య రాజ్‌, మల్లికా వల్లూరు అంకుర పరిశ్రమలను స్థాపించి, స్వయం ఉపాధి పొందడమే గాక పలువురు మహిళలకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరడం, వీహబ్‌ ద్వారా వారికి ప్రోత్సాహం వంటి అంశాలున్నాయి. వీటిపై కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేస్తూ ట్విటర్‌కు జత చేశారు.v

  • Tags