• facebook
  • whatsapp
  • telegram

పాలిటెక్నిక్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

కార్వాన్‌, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా సెప్టెంబ‌రు 14న‌ మాసాబ్‌ట్యాంక్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల్లో విద్యార్హత ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమైంది. విద్యార్థులు మాస్కులు ధరించి ఎడం పాటించారు.కరోనా నిబంధనలు అనుసరిస్తూ ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త బి.భీంజీ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, రిజర్వేషన్లు అనుసరించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కేటగిరీల వారీగా ధ్రువీకరణపత్రాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సహాయ సమన్వయకర్త లక్ష్మణ్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.