• facebook
  • whatsapp
  • telegram

ఈసెట్‌కు 85.8 శాతం హాజరు

అనంత జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: ఏపీ ఈసెట్‌-2020 పరీక్షలు  సెప్టెంబ‌రు 14న‌ సజావుగా ముగిశాయి. అనంతపురం జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈసెట్‌కు ఏపీ, తెలంగాణల్లో 79 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. మొత్తం 37,167 మందికి గాను 31,891 మంది (85.8శాతం) హాజరైనట్లు పరీక్షల కన్వీనరు భానుమూర్తి తెలిపారు. సెప్టెంబ‌రు 15న‌ ప్రాథమిక కీ వెబ్‌సైట్లో ఉంచి, సెప్టెంబ‌రు 22, 23వ తేదీల్లో ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.