• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ, పీజీ పరీక్షల ‘నిర్వహణ’పై స్పష్టత ఇవ్వండి

* ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ అధికారులకే స్పష్టత లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీచేయాలని సెప్టెంబ‌రు 14న‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఓవైపు ఆన్‌లైన్‌ పరీక్షలకు ససేమిరా అంటూనే మరోవైపు అటానమస్‌ యూనివర్సిటీలు, కళాశాలలు మాత్రం నిర్వహించుకోవచ్చంటున్నారు. ఇలాంటి భిన్నమైన ప్రకటనలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌ పరీక్షలను ఎవరికి అనుమతిస్తున్నారు? ఎవరికి నిరాకరిస్తున్నారన్న దానిపై స్పష్టతతో ఆదేశాలివ్వాలి’’ అని పేర్కొంటూ విచారణను సెప్టెంబ‌రు 15కు వాయిదా వేసింది. కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షలు, డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బి.వి.నర్సింగరావు తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సెప్టెంబ‌రు 14న‌ మరోసారి విచారణ చేపట్టింది.