• facebook
  • whatsapp
  • telegram

పీజీ పరీక్షలు ప్రారంభం

వెంకటాచలం, న్యూస్‌టుడే: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబ‌రు 14 నుంచి పీజీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 134 మంది విద్యార్థులకు 124 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాసినట్లు వీఎస్‌యూ పరీక్షల నియంత్రణ అధికారి సాయి ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి రొక్కం సుదర్శనరావు పరీక్షల నిర్వహణను పరిశీలించారు. పక్కాగా ఏర్పాటు చేయటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా బారిన పడిన విద్యార్థులు వైద్యుల వద్ద నుంచి రిపోర్టులు తెస్తే వారికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని వీఎస్‌యూ రిజిస్ట్రార్‌ ఎల్‌.విజయకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.