• facebook
  • whatsapp
  • telegram

యూజీసీ నెట్‌ పరీక్షలు 24కు వాయిదా

దిల్లీ: యూజీసీ-నెట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ పరీక్షల నిర్వహణ ఏజెన్సీ తెలిపింది. సెప్టెంబ‌రు 24 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ పరీక్షలను 16 నుంచి 25 వరకు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌)కి సంబంధించిన పరీక్షలు కూడా సెప్టెంబ‌రు 17, 22, 23 తేదీల్లో ఉండటంతో యూజీసీ-నెట్‌ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చిందని జాతీయ పరీక్షల నిర్వహణ ఏజెన్సీ సీనియర్‌ డైరెక్టర్‌ సాధన పరాశర్‌ తెలిపారు. సబ్జెక్టులవారీగా పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు.