• facebook
  • whatsapp
  • telegram

ఒకేసారి గ్రూపు-1, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు

* ఆందోళనలో అభ్యర్థులు

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 ప్రధాన పరీక్షలు జరిగే తేదీల్లోనే.. ‘కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌’ పరీక్షలు జరగనుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో వాయిదా వేసిన గ్రూపు-1 ప్రధాన పరీక్షలను నవంబరు 2 నుంచి నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగే పరీక్షలూ నవంబరు 2 నుంచి 5 వరకు జరగబోతున్నాయి. కొందరు అభ్యర్థులు రెండు పరీక్షలనూ రాస్తారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.