• facebook
  • whatsapp
  • telegram

అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నగరాలు మార్చుకోవచ్చు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సెప్టెంబ‌రు 27వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తాము రాసే పరీక్ష నగరాలను మార్చుకునేందుకు మరోసారి అవకాశం ఇచ్చారు. గతంలో ఏపీలో 16, తెలంగాణలో 7 నగరాలు/పట్టణాల్లో పరీక్ష జరుపుతామని అధికారులు ప్రకటించగా తాజాగా వాటిని ఏపీలో 30, తెలంగాణలో 15 ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 731 ప్రాంతాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈక్రమంలో  సెప్టెంబ‌రు 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి సెప్టెంబ‌రు 17 సాయంత్రం 5 గంటల వరకు నగరాలను మార్చుకోవచ్చని తెలిపారు.