• facebook
  • whatsapp
  • telegram

దోస్త్‌ సీట్ల కేటాయింపు 21కి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి విడత సీట్ల కేటాయింపు సెప్టెంబ‌రు 21వ తేదీకి వాయిదా పడింది. సెప్టెంబ‌రు 16వ తేదీన సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. కానీ 9వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చినందున ఆలస్యమైవుతున్నట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. సీట్ల కేటాయింపు జరిగే 21వ తేదీ నుంచే రెండో విడత రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.