• facebook
  • whatsapp
  • telegram

రిమ్స్‌లో 41 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ వైద్యకళాశాలలో వేర్వేరు విభాగాలకు చెందిన 41 వైద్యుల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి రిమ్స్‌ సంచాలకులు సెప్టెంబ‌రు 15న‌ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబ‌రు 22న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని పేరొన్నారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, సోషల్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, టీబీ, డీవీఎల్‌, సైకియాట్రీ, పిడియాట్రిక్స్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్‌టీ, గైనకాలజీ, రేడియో డయోగ్నొసిస్‌, అనిస్థీషియా, ఎపిడిమియాలజిస్ట్‌ తదితర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.