• facebook
  • whatsapp
  • telegram

సచివాలయ పరీక్షలకు సన్నద్ధం

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: సెప్టెంబ‌రు 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు అంతా సిద్ధం చేశామని కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సెప్టెంబ‌రు  16న‌ విజయవాడ నుంచి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్ససత్యనారాయణ అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో దూరశ్రవణ వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక అర్హత పరీక్షలకు జిల్లాలో ఐదు క్లస్టర్లుగా విభజించామన్నారు. మొత్తం 70,714 మంది దరఖాస్తు చేశారని, 387 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వారం రోజులపాటు జరిగే ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు రెండు పూటలా నిర్వహిస్తామన్నారు. వీసీలో జేసీలు నిశాంత్‌కుమార్‌, డాక్టర్‌ సిరి, గంగాధర్‌గౌడ్‌ పాల్గొన్నారు.