• facebook
  • whatsapp
  • telegram

ఏపీలో ప్రశాంతంగా ఎంసెట్‌ పరీక్షలు

అమరావతి: రాష్ట్రంలో ఎంసెట్‌ పరీక్షలు సెప్టెంబ‌రు 17న‌ ప్రారంభమయ్యాయి. 17 నుంచి 25వరకు రోజుకు రెండు విడతలుగా పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10గంటల నంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5.30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 17, 18, 21, 22, 23 తేదీల్లో ఇంజినీరింగ్‌, 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్‌ ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ విద్యార్థులు పరీక్షలు రాసేలా ఆయా కేంద్రాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్క్రీనింగ్‌ చేసిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు.