• facebook
  • whatsapp
  • telegram

27న అంబేడ్కర్‌ వర్సిటీ అర్హత పరీక్ష

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్షను సెప్టెంబ‌రు 27వ తేదీన నిర్వహించనున్నట్లు వర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పరీక్ష ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్‌www.braouonline.inలో పరీక్షకు రెండు రోజుల ముందు నుంచే హాల్‌టికెట్లను పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు సమీప అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని లేదంటే 04023680241/251 ఫోన్‌ నంబర్లలో లేదా విశ్వవిద్యాలయ సహాయ కేంద్రం 7382929570/580/590/600 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.