• facebook
  • whatsapp
  • telegram

21 నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు

ఈనాడు, అమరావతి: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీ పరీక్షలు సెప్టెంబ‌రు 21 నుంచి 27వ తేదీ వరకు విజయవాడలో జరగనున్నాయి. జిల్లా కేంద్రాల్లో కాకుండా విజయవాడలోనే పరీక్షలు నిర్వహించబోతున్నందున దూర ప్రాంతాల నుంచి చేరుకోవడం ఇబ్బందిగా ఉంటుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజూ పరీక్షలు రాసే వారి సంఖ్య పరిమితంగానే ఉంటుంది కాబట్టి విజయవాడలోనే జరుపుతున్నామని ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. కరోనా సోకి చికిత్స పొందినట్లయితే...‘నెగెటివ్‌’ రిపోర్టును పరీక్షా కేంద్రాలవద్ద ఇవ్వాలని సూచించారు. మరోవైపు సెప్టెంబ‌రు 20 నుంచి 26 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి. కొందరు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు, సచివాలయ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేశారు. దీనివల్ల ఏ పరీక్ష రాయాలో తెలియక అయోమయంలో ఉన్నారు.