• facebook
  • whatsapp
  • telegram

వెబ్‌సైట్‌లో గురుకుల కళాశాల విద్యార్థుల జాబితా

ఈనాడు, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల్లో మొదటి ఏడాది ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు కార్యదర్శి ప్రసన్న కుమార్‌ తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో సెప్టెంబ‌రు 23లోపు ఐచ్ఛికాలు ఇవ్వాలని, సీట్ల కేటాయింపు వివరాలను 25న ప్రకటిస్తామని వెల్లడించారు. సీట్లు పొందిన వారు వెబ్‌సైట్‌లో సూచించిన ఈ-మెయిల్‌కు సెప్టెంబ‌రు 30వ తేదీ లోగా ధ్రువపత్రాలను పంపాలని సూచించారు.