• facebook
  • whatsapp
  • telegram

ఎన్‌ఆర్‌ఏతో నియామకాల్లో విప్లవాత్మక మార్పులు

* టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి
ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగ నియామక ప్రక్రియలో జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటుతో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. దేశంలోని 20కిపైగా ఉద్యోగ నియామక సంస్థలన్నీ ఒకేగొడుగు కిందకు రానున్నాయన్నారు. గురువారమిక్కడ కేంద్ర ప్రసార, సమాచారశాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఏపై నిర్వహించిన వెబినార్లో మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఏతో ఉద్యోగార్థుల్లో పారదర్శకత పెరుగుతుందని, ప్రజాస్వామ్యయుతంగా నియామకాలకు వీలవుతుందని చక్రపాణి తెలిపారు. ఒకే అర్హత, ఒకే సిలబస్‌తో కూడిన వేర్వేరు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడం, ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదని చెప్పారు.