• facebook
  • whatsapp
  • telegram

సీపీజీఈటీ - 2020 ప్రకటన విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ - 2020 (కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్టు) ప్రకటన సెప్టెంబ‌రు 17న‌ విడుదలైంది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాల పరిధిలోని పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి చేపట్టే ఈ ప్రవేశపరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. సెప్టెంబ‌రు 17నుంచి అక్టోబర్‌ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పాలిసెట్‌ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు
ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో.. 2020-21 విద్యాసంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను పాలిసెట్-2020 ర్యాంకుల ఆధారంగానే జరుపుతామని రిజిస్ట్రార్‌  సుధీర్‌కుమార్‌ తెలిపారు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకొనే అభ్యర్థులు పాలిసెట్-2020 అగ్రికల్చర్‌ స్రీˆ్టమ్‌లో సాధించిన ర్యాంకులతో అక్టోబరు 16 లోపు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.