• facebook
  • whatsapp
  • telegram

సివిల్‌ సర్వీసెస్‌లో సీశాట్‌ ఉంటుంది: కేంద్ర మంత్రి

దిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీశాట్‌) ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ సమాధానమిస్తూ.. ఆ పరీక్షను తొలగించాలన్న ప్రతిపాదనేమీ లేదని తెలిపారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల నమూనాను కూడా మార్చబోమని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.