• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కి 1,60,864 మంది నమోదు

ఈనాడు, దిల్లీ: సెప్టెంబర్‌ 27న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరయ్యేందుకు 1,60,864 మంది విద్యార్థులు నమోదుచేసుకున్నట్లు ఐఐటీ-దిల్లీ ప్రకటించింది. కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే నగరాల సంఖ్యను 164 నుంచి 222కి.. పరీక్షాకేంద్రాల సంఖ్యను 600 నుంచి 1,150కి పెంచినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 24 నగరాల్లో, తెలంగాణలో 15 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 27న ఉదయం 9 నుంచి 12 గంటలవరకు పేపర్‌-1 ,  మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటలవరకు పేపర్‌-2 ఉంటుందని తెలిపింది. దివ్యాంగులకు ఒక గంట ఎక్కువ సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీలో కేంద్రాలు
అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కావలి, కర్నూలు, మచిలీపట్నం, మార్కాపురం, మైలవరం, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం.