• facebook
  • whatsapp
  • telegram

ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎ.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా సెప్టెంబరు 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల విద్యార్థులు ‌www.tsmodelschools.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.