• facebook
  • whatsapp
  • telegram

విద్యార్థుల వద్దకే టీచర్లు

* గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ఏజెన్సీల్లో సరైన వసతుల్లేని గిరిజన విద్యార్థుల వద్దకు ఉపాధ్యాయులు వెళ్లి బోధించాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులతో సెప్టెంబ‌రు 19న‌ సమీక్ష నిర్వహించారు. గిరిజన విద్యాలయాల ప్రారంభం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను  వివరించారు.
గిరిజన శాఖ ఉత్తర్వులు విరమించుకోవాలి: ఉపాధ్యాయ సంఘాలు
గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠాలు బోధించాలని ఆ శాఖ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని టీఎస్‌యూటీఎఫ్‌, టీపీటీఎఫ్‌, టీఎస్‌టీటీఎఫ్‌ టీయూటీఎఫ్‌ తదితర సంఘాలు డిమాండ్‌ చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాయి. యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, సీహెచ్‌ రవి  గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శి, కమిషనర్‌కు లేఖ రాశారు.