• facebook
  • whatsapp
  • telegram

అక్టోబరు 4న డీఈఈసెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: డీఎడ్‌, డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశానికి డీఈఈసెట్‌ను అక్టోబరు 4వ తేదీన జరపాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆ రోజు రెండు విడతల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది.. ఉదయం 10-12 గంటల వరకు తెలుగు మాధ్యమం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంగ్లం, ఉర్దూ మాధ్యమం పరీక్షలు నిర్వహిస్తారు.