• facebook
  • whatsapp
  • telegram

ఎంబీఏ విద్యార్థులకు ఐఆర్‌పీ కోర్సు: హెచ్‌ఎంఏ

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారితో పాటు ఈ ఏడాది కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ‘ఇండస్ట్రీ రెడీనెస్‌ ప్రోగ్రాం’ అందించనున్నట్లు హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఏ) సీవోవో గీతా మల్లికార్జున్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా కార్పొరేట్‌ సంస్థల అవసరాలకు తగినట్టుగా వివిధ అంశాల్లో వారాంతాల్లో ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అర్హులైన విద్యార్థులకు రాతపరీక్ష, మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు సెప్టెంబ‌రు 26లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. రాత పరీక్ష సెప్టెంబ‌రు 30న నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 2, 3 తేదీల్లో మౌఖిక పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.