• facebook
  • whatsapp
  • telegram

9-12 తరగతుల విద్యార్థులు విద్యాలయాలకు రావొచ్చు

* మార్గదర్శకాల జారీ యోచనలో విద్యాశాఖ
ఈనాడు, హైదరాబాద్‌: సందేహాల నివృత్తికి, హోం వర్క్‌ సమర్పించేందుకు 9, 10తరగతులతో పాటు ఇంటర్‌ విద్యార్థులు తమ తల్లిదండ్రుల సమ్మతితో సెప్టెంబ‌రు 21వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లొచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలిచ్చాయి. ఈ క్రమంలో పలు ప్రైవేట్‌ పాఠశాలలు తల్లిదండ్రులకు సమాచారం అందించాయి. పాఠశాల విద్యాశాఖ నుంచి స్పష్టమైన మార్గదర్శకాల కోసం యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి. కేంద్ర ఆదేశాల ప్రకారం పిల్లలు పాఠశాలలకు వచ్చి సందేహాలు తీర్చుకోవచ్చని, కాకపోతే రెండుమూడు రోజులు పరిశీలించి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. అయితే అందరూ రావొచ్చని ప్రచారం చేయొద్దని రాష్ట్ర అధికారులు జిల్లాస్థాయి అధికారులకు సూచించినట్లు సమాచారం.