• facebook
  • whatsapp
  • telegram

ఏకోపాధ్యాయ పాఠశాలల టీచర్లకు రోజు విడిచి రోజు విధులు

* విద్యాశాఖ మార్గదర్శకాలు
ఈనాడు, హైదరాబాద్‌: ఏకోపాధ్యాయ పాఠశాలలకు సెప్టెంబ‌రు 21 నుంచి ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరుకావాలనే పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆయా డీఈఓలు మార్గదర్శకాలు జారీ చేశారు. సెప్టెంబ‌రు 21వ తేదీ నుంచి పాఠశాలలకు గరిష్ఠంగా 50 శాతం మంది హాజరుకావాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఒక్కరే ఉపాధ్యాయుడు పనిచేసే చోట ఎలాగని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సందేహాలను లేవనెత్తాయి. ఈక్రమంలో ఒక్క ఉపాధ్యాయుడు ఉన్న చోట సోమ, బుధ, శుక్రవారాలు విధులకు హాజరు కావాలని, మిగిలిన మూడు రోజులు ఇంటి నుంచి పనిచేయాలని సూచిస్తూ అధికారులు ఆదేశాలిచ్చారు.