• facebook
  • whatsapp
  • telegram

దోస్త్‌ మొదటి దశ సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌: దోస్త్‌-2020లో భాగంగా మొదటి దశ సీట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి కేటాయించింది. రాష్ట్రంలో 1,41,340 మంది విద్యార్థులకు మొదటి దశలో డిగ్రీ సీట్లు కేటాయించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. 1,71,275 మంది విద్యార్థులు దోస్త్‌లో నమోదు చేసుకున్నారన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబ‌రు 26 వరకు దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తర్వాత రెండో విడతలో వెబ్‌ఆప్షన్లు ఇవ్వొచ్చన్నారు. 21 నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని లింబాద్రి స్పష్టం చేశారు.

 

ప్రెస్‌నోట్‌