• facebook
  • whatsapp
  • telegram

సచివాలయ పరీక్షలకు 1,21,306 మంది హాజరు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలు రెండో రోజైన సెప్టెంబ‌రు 21న‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం వీఆర్‌వో, గ్రామ సర్వేయర్‌ పోస్టులకు, మధ్యాహ్నం ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, వార్డు వసతుల కల్పన కార్యదర్శి పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,82,155 మంది  హాల్‌టిక్కెట్లను పొందగా 1,21,306 మంది పరీక్షలు రాశారు. ఉదయం 64.62% మంది, మధ్యాహ్నం 69.92% మంది హాజరయ్యారు. కొవిడ్‌ పాజిటివ్‌, సంబంధిత లక్షణాలు కనిపించిన 131 మందికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ఇలాంటి వారు పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 68 మంది హాజరయ్యారు.