• facebook
  • whatsapp
  • telegram

షిఫ్టు పద్ధతిలో జూనియర్‌ కళాశాలలు

* కేంద్రం నుంచి అనుమతి రాగానే అమలు
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో షిఫ్టు పద్ధతిలో జూనియర్‌ కళాశాలలను తెరవనున్నారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు పంపిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే షిఫ్టు పద్ధతిలో కళాశాలలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్‌బోర్డు సమాయత్తమైంది. భౌతిక దూరం పాటించాల్సిన దృష్ట్యా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఎంపీసీ, బైపీపీ గ్రూపుల్లో సీబీఎస్‌ఈ తొలగించిన పాఠ్యాంశాలను ఇక్కడా తొలగిస్తున్నామని, అందువల్ల జేఈఈ, నీట్‌లకూ సమస్య ఉండదని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఆయన పేర్కొన్నారు.