• facebook
  • whatsapp
  • telegram

పరీక్షలు లేకుండానే పైతరగతులకు..

* నర్సింగ్‌ విద్యార్థులపై ప్రభుత్వ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా జీఎన్‌ఎం నర్సింగ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న నర్సింగ్‌ విద్యార్థులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. మూడో ఏడాది విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అక్టోబరు, నవంబరు మాసాల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించలేకపోతున్నందున.. మొదటి, రెండో సంవత్సరం నర్సింగ్‌ విద్యార్థులను పై తరగతులకు ఉత్తీర్ణులను చేస్తున్నామని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలల ప్రధానాచార్యులు చేపట్టాలని సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేరొన్నారు.

  • Tags