• facebook
  • whatsapp
  • telegram

ఓయూ డిగ్రీ పరీక్షలకు 97 శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: ఒకవైపు కొవిడ్‌ కల్లోలం.. మరోవైపు అందుబాటులో లేని ప్రజారవాణా.. అయినప్పటికీ చివరి సెమిస్టర్‌ పరీక్షలకు విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) పరిధిలో డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబరు 22న‌ ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఏకంగా 97 శాతం హాజరు నమోదైంది. ఇప్పటివరకు వర్సిటీ చరిత్రలో డిగ్రీ పరీక్షలకు ఇంత పెద్దఎత్తున హాజరు నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. యూజీ కోర్సులకు సంబంధించి చివరి ఏడాది చివరి సెమిస్టర్‌ పరీక్షలను రోజూ రెండు సెషన్లలో ఓయూ నిర్వహిస్తోంది. ఉదయం సెషన్‌లో బీకాం, మధ్యాహ్నం సెషన్‌లో బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల పరీక్షలు జరుగుతున్నాయి. ఆయా కోర్సులలో 57,436 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. తొలిరోజు 55,875 మంది హాజరయ్యారు.

  • Tags