• facebook
  • whatsapp
  • telegram

ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు పరీక్ష

ఈనాడు, అమరావతి: ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల కేటాయింపునకు మొదటిసారిగా ఈ ఏడాది ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. గణితం, సామాన్యశాస్త్రం సబ్జెక్టులపై పరీక్ష నిర్వహిస్తారు. మూడు గంటల వ్యవధిలో.. పెన్ను, పేపర్‌ (ఆఫ్‌లైన్‌) విధానంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని కడప, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో 4 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షకు సుమారు 60 వేల మంది విద్యార్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదట్లో అంతర్గత మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించాలనుకున్నా.. ప్రైవేటు పాఠశాలలు ఎక్కువ మార్కులు వేసినట్లు పరిశీలనలో తేలడంతో ఆ విధానాన్ని విరమించుకున్నారు.

  • Tags