• facebook
  • whatsapp
  • telegram

22,064 మందికి పాలిసెట్‌ సీట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: మొదటి విడత పాలిసెట్‌ కౌన్సెలింగ్‌లో 22,064 మందికి సీట్లు దక్కాయి. సెప్టెంబరు 22న రాత్రి సీట్లను కేటాయించారు. రాష్ట్రంలోని 128 ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 31,012 సీట్లు అందుబాటులో ఉండగా 22,064(71.14%) కేటాయించారు. ఇంకా 8,948 మిగిలిపోయాయి. వాటిల్లో 547 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయి. పాలిసెట్‌లో మొత్తం 45,207 మంది అర్హత సాధించినా వెబ్‌ ఆప్షన్లు 27,759 మంది మాత్రమే ఇచ్చుకున్నారు. అంటే ఇంకా 5 వేల మందికిపైగా సీట్లు దక్కలేదు. రాష్ట్రంలో 54 ప్రభుత్వ కళాశాలలుండగా.. వాటిల్లో 40 చోట్ల మొత్తం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు  సెప్టెంబరు 26వ తేదీలోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌రిపోర్ట్‌ చేసి ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి.

  • Tags