• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీ-జేఈఈ, నీట్‌ సీట్ల భర్తీ వివరాల బుక్‌లెట్‌ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీ-జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల అవగాహన కోసం గతేడాది సీట్ల భర్తీకి సంబంధించి విశ్లేషణతో కూడిన బుక్‌లెట్‌ అందుబాటులోకి తెచ్చినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్‌ ఫోరం కన్వీనర్‌ కె.లలిత్‌కుమార్‌ తెలిపారు. మొబైల్‌లో పీడీఎఫ్‌ వర్షన్‌ కావాలనుకునే విద్యార్థులు 98490 16661 నంబరుకు వాట్సప్‌లో ఇంజినీరింగ్‌ కేటగిరీకి ‘బుక్‌లెట్‌’ అని, మెడికల్‌ కేటగిరీకి ‘నీట్‌ బుక్‌లెట్‌’ అని సందేశం పంపవచ్చని సూచించారు.