• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు అక్టోబరు 15 వరకు పొడిగింపు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువును పొడిగించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. డిగ్రీ బీఏ/బీకాం/బీఎస్సీ, పీజీ బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరడానికి గడువును అక్టోబరు 15 వరకు పొడిగించాయి. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, రుసుం వివరాలను www.braouonline.in లో పొందుపరిచాయి. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600 నంబర్లలో లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040 23680333/555లలో పొందవచ్చని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.