• facebook
  • whatsapp
  • telegram

ట్రిపుల్‌ ఐటీ సెమిస్టర్‌ పరీక్షలు ఆచార్యుల ఇష్టం!

* విద్యా సంవత్సరంలో కీలక మార్పులు
ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత (2020-21) విద్యా సంవత్సరంలో కీలక మార్పులు చేస్తూ ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్‌ నిర్ణయం తీసుకుంది. ఈసారి సెమిస్టర్‌ పరీక్షలను ఆచార్యుల ఇష్టానికే వదిలేసింది. వారు అవసరమనుకుంటే పరీక్షలు పెట్టవచ్చు.. లేదనుకుంటే ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మార్కులు ఇవ్వొచ్చు. ‘‘మారుతున్న కాలానికి అనుగుణంగా ట్రిపుల్‌ఐటీ కరిక్యులమ్‌, మూల్యాంకన విధానంలో కీలక మార్పులు తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నాం. సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ ఆయా విభాగాల ఆచార్యులే నిర్ణయించుకునేందుకు వీలుగా వర్సిటీ వెసులుబాటు కల్పించింది’’ అని ట్రిపుల్‌ఐటీ-అటల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం సంచాలకుడు, ప్రొఫెసర్‌ రమేశ్‌ లోగనాథన్‌ వివరించారు.
తాజా మార్పులు 
* సెమిస్టర్‌ పరీక్షలు లేకుండా ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌, క్విజ్‌లు, ఆన్‌లైన్‌ హ్యాకథాన్‌, ప్రాజెక్టుల ద్వారా మార్కులు కేటాయిస్తారు.
* ఈసారి ఎ, బి, సి, ఎఫ్‌ గ్రేడ్లు మాత్రమే ఇవ్వాలని భావిస్తున్నారు.
* తొలి ఏడాదిలో ప్రవేశాలు తీసుకునే విద్యార్థులందరికీ ల్యాబ్‌ ఉంటుంది. రెండో ఏడాదిలో ఎలక్ట్రానిక్స్‌ విభాగం విద్యార్థులకే ఉంటుంది. ప్రస్తుతం మొదటి ఏడాదిలో చేరిన విద్యార్థులు ఇప్పట్లో క్యాంపస్‌కు వచ్చే వీలుండదు. తొలి ఏడాదిలో చదవాల్సినవి రెండో ఏడాదికి మార్చడం, రెండో ఏడాదిలోవి మూడో ఏడాదికి మారుస్తున్నారు.  
* జేఈఈ పద్ధతిలో వచ్చే విద్యార్థులకు వచ్చే నెలాఖరులోగా కౌన్సెలింగ్‌ పూర్తి చేసి నవంబరు నుంచి తరగతులు ప్రారంభిస్తారు.