• facebook
  • whatsapp
  • telegram

మహనీయుల పాఠ్యాంశాలను తొలగించొద్దు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ పాఠ్య ప్రణాళిక నుంచి జాతీయ వీరులు, సంఘ సంస్కర్తలు, ప్రముఖ వ్యక్తులకు సంబంధించి పాఠాలు/అధ్యాయాలను తొలగించరాదని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఇంటర్‌బోర్డును ఆదేశించారు. ఈ మేరకు  సెప్టెంబ‌రు 24న‌ ఆమె ప్రకటన జారీ చేశారు. ఇంటర్‌ సిలబస్‌ 30 శాతం తగ్గింపులో భాగంగా చరిత్ర, రాజకీయశాస్త్రాల నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే తదితర మహనీయులకు సంబంధించి పాఠ్యాంశాలను తొలగిస్తూ ఇంటర్‌బోర్డు ప్రకటన జారీ చేసింది. అది వివాదాస్పదం కావడంతో వాటిని తొలగించడం లేదని బోర్డు కార్యదర్శి జలీల్‌ ప్రకటించారు. ఈక్రమంలో ప్రభుత్వం సైతం స్పందించింది. వాటిని తొలగించరాదని, ప్రభుత్వ సూచనలను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించరాదని చిత్రా రామచంద్రన్‌ బోర్డును ఆదేశించారు.