• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ మార్కులతో ఆర్‌ఐఈల్లో సీట్ల భర్తీ

* కరోనా కారణంగా ఈసారి ఆర్‌ఐఈ జేఈఈ రద్దు
ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌కు ఐఐటీలు.. ఫార్మసీకి నైపర్లు.. మేనేజ్‌మెంట్‌ విద్యకు ఐఐఎంల మాదిరిగా ఉపాధ్యాయ విద్యకు జాతీయ స్థాయిలో పేరొందిన రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఆర్‌ఐఈ) సంస్థల్లో ఈసారి ఇంటర్‌/డిగ్రీ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు. ఏటా దేశవ్యాప్తంగా ఆర్‌ఐఈ జేఈఈ పేరిట ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇచ్చి బీఈడీ, ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, ఎంఈడీ లాంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేసేవారు. ఈసారి కరోనా కారణంగా ప్రవేశ పరీక్షను నిర్వహించకూడదని అధికారులు నిర్ణయించారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీలకు ఇంటర్‌, బీఈడీకి డిగ్రీ, ఎంఈడీకి బీఈడీలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల భర్తీ చేయనున్నారు. అక్టోబరు మొదటి వారంలో దరఖాస్తులను ఆహ్వానించనున్నారు.