• facebook
  • whatsapp
  • telegram

ఎంఎన్‌జేలో 36 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: మెహిది నవాజ్‌ జంగ్‌(ఎంఎన్‌జే) ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ అండ్‌ రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో 36 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబ‌రు 24న‌ నియామక ప్రకటనను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లోఅక్టోబ‌రు 23లోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.