• facebook
  • whatsapp
  • telegram

ఏపీ ఐసెట్‌లో 78.65% మంది అర్హత

* ఫలితాలు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌
ఈనాడు, అమరావతి: ఏపీ ఐసెట్‌లో 78.65శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పరీక్షకు మొత్తం 51,991మంది అభ్యర్థులు హాజరుకాగా.. 40,890 మంది అర్హత సాధించారని వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సెప్టెంబ‌రు 25న‌ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ రామమోహనరావు తదితరులతో కలిసి ఆయన ఐసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. పురుషులు 78.28శాతం మంది ఉత్తీర్ణత సాధించగా..మహిళలు 79.08 శాతం మంది అర్హత సాధించారు. ర్యాంకు కార్డులను సెప్టెంబ‌రు 30 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మొదటి 10 ర్యాంకుల్లో నలుగురు మహిళలు కాగా.. తెలంగాణకు చెందిన శుభశ్రీ, అవినాష్‌ సిన్హా 3, 4 ర్యాంకులు సాధించారు.

Posted Date : 26-09-2020 .