• facebook
  • whatsapp
  • telegram

నవంబరులో ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నవంబరు మొదటి లేదా రెండో వారంలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్ష 100 మార్కులకు ఉంటుందన్నారు. గణితం, సామాన్యశాస్త్రం సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారని తెలిపారు. పరీక్ష సమయం మూడు గంటలు ఉంటుందని వెల్లడించారు. పదోతరగతి పాఠ్యాంశాలపైనే ప్రశ్నలు ఉంటాయన్నారు. స్థానికేతరుల కోటా 15 శాతానికీ పరీక్ష రాయాల్సి ఉంటుందని, నమూనా ప్రశ్నపత్రాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Posted Date : 26-09-2020 .