• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌ ఫలితాలు అక్టోబరు 6 లేదా 7న

ఈనాడు, అమరావతి: ఎంసెట్‌ ఫలితాలను అక్టోబరు 6 లేదా 7న విడుదల చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. కరోనా పాజిటివ్‌ కారణంగా ఎంసెట్‌లో 21మంది, ఐసెట్‌లో ఏడుగురు పరీక్ష రాయలేకపోయారని, వీరికి అక్టోబరు 7న ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంజినీరింగ్‌కు 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,56,899 మంది పరీక్షకు హాజరయ్యారని, వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలకు 87,652 మంది దరఖాస్తు చేసుకోగా.. 75,834 మంది రాశారని తెలిపారు.

Posted Date : 26-09-2020 .