• facebook
  • whatsapp
  • telegram

సీట్లు కేటాయించాక ధ్రువపత్రాలు ఇవ్వొచ్చు

* జేఈఈ అడ్వాన్స్‌డ్‌ విద్యార్థులకు ఊరట
ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులు వివిధ రిజర్వేషన్లకు సంబంధించి ధ్రువపత్రాలను సీట్లు కేటాయించిన తర్వాత అప్‌లోడ్‌ చేస్తే చాలని ఐఐటీ దిల్లీ వెల్లడించింది. సెప్టెంబ‌రు  26వ తేదీలోపు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ లాంటి ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఆయా ధ్రువపత్రాలను పొందేందుకు విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ దిల్లీ అధికారులు దీనిపై సమీక్షించి ఊరటనిస్తూ సీట్ల కేటాయింపు తర్వాత ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేస్తే చాలని నిర్ణయం తీసుకున్నారు.

Posted Date : 27-09-2020 .