• facebook
  • whatsapp
  • telegram

నీట్‌ సూపర్‌ స్పెషాలిటీలో తెలుగువెలుగులు

* తిరుపతి యువకుడికి ప్రథమ ర్యాంకు
* సిక్కోలు వైద్యుడికి రెండో ర్యాంకు

తిరుపతి(వైద్యవిభాగం), కాశీబుగ్గ, న్యూస్‌టుడే: నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు సత్తాచాటారు. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఉలిచి శ్రీరామరాజు జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఇతను రుయా ఆస్పత్రిలో జనరల్‌ సర్జరీ పూర్తి చేశారు. సూపర్‌ స్పెషాలిటీలోని ఎంసీహెచ్‌ ప్లాస్టిక్‌ సర్జరీలో రీ-కన్‌స్ట్రక్షన్‌ విభాగాన్ని ఎంచుకోనున్నట్లు శ్రీరామరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలోని నర్శిపురానికి చెందిన వైద్యుడు పైల మనోహర్‌.. డి.ఎం.కార్డియాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో రెండో స్థానం సాధించారు. మనోహర్‌ ఏలూరులో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. చండీగఢ్‌లో పీజీ(జనరల్‌ మెడిసిన్‌) చేశారు. మనోహర్‌ తల్లిదండ్రులు వెంకటరమణ, లలితకుమారి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.సెప్టెంబరు 15వ తేదీన జరిగిన ప్రవేశ పరీక్షా ఫలితాలు సెప్టెంబ‌రు 25వ తేదీన విడుదలయ్యాయి.