• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌కు 1.51 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రతిష్ఠాత్మక జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దేశవ్యాప్తంగా సెప్టెంబ‌రు 27న‌ జరగనుంది. మొత్తం 1.51 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా తెలంగాణలో 15, ఏపీలో 30 పట్టణాల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్‌-2 జరగనుంది. విద్యార్థులు క‌రోనా బారిన పడకుండా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కనీసం 30 వేల మంది వరకు పరీక్ష రాస్తారని అంచనా. ఈ పరీక్షల ఫలితాలు అక్టోబరు 5న వెల్లడవుతాయి.