• facebook
  • whatsapp
  • telegram

28 నుంచి ఎంసెట్‌ అగ్రికల్చర్‌

* జాతీయ పరీక్షలు క్లాట్‌, నైపర్‌ జేఈఈ కూడా 
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీఎస్‌సీ అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌(అగ్రికల్చర్‌) సెప్టెంబ‌రు 28 నుంచి రెండు రోజులపాటు జరగనుంది. రోజుకు రెండు విడతల చొప్పున ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 78 వేల మంది దరఖాస్తు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు(క్లాట్‌) కూడా సెప్టెంబ‌రు 28న‌ జరగనుంది. దీనికి దేశవ్యాప్తంగా 77 వేల మంది హాజరుకానున్నారు. ఇంకా ఫార్మా విద్యకు పేరుపొందిన జాతీయ ఫార్మా విద్య, పరిశోధన సంస్థ(నైపర్లు)ల్లో ఎంబీఏ, ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నైపర్‌ జేఈఈ పరీక్ష కూడా 28వ తేదీన‌ జరగనుంది.

Posted Date : 28-09-2020 .