• facebook
  • whatsapp
  • telegram

ఆలస్యంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌

మేడ్చల్‌, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా సెప్టెంబ‌రు 27న‌ నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. సాంకేతిక సమస్యతో మేడ్చల్‌లో ఆలస్యంగా జరిగింది. కండ్లకోయ సీఎంఆర్‌ కళాశాలల్లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉదయం 9 నుంచి 12 వరకు జరగాల్సిన పరీక్ష 9.45కు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం 2.30కు ప్రారంభం కావాల్సిన పరీక్షను నిర్వాహకులు 3 గంటలకు వాయిదా వేశారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో పరీక్ష పూర్తయ్యాక విద్యార్థుల బయోమెట్రిక్‌ తీసుకున్నారు. పరీక్ష నిర్వహణపై సిబ్బంది నిర్లక్ష్యం వహించారని విద్యార్థులు ఆందోళన చేశారు.

Posted Date : 28-09-2020 .