• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్‌కు తొలిరోజు 81.55% హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌కు రెండు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజు సెప్టెంబ‌రు 28న‌ 81.55 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 39,472 మందికి 32,191 మంది పరీక్ష రాశారు. తెలంగాణలో మొదటి రోజు 85.58 శాతం, ఏపీలో 67.17 శాతం మంది హాజరయ్యారు. ఈ పరీక్ష మంగళవారం కూడా కొనసాగనుంది.
క్లాట్‌కు 86.20%..
దేశంలోని 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సెప్టెంబ‌రు 28న‌ నిర్వహించిన కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు(క్లాట్‌-2020)కు 86.20 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 75,183 మంది దరఖాస్తు చేయగా వారిలో 68,833 మంది పరీక్ష రాసినట్లు నల్సార్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఫైజన్‌ ముస్తాఫా తెలిపారు. లక్షద్వీప్‌లోని కవరత్తిలో ఒక విద్యార్థి దరఖాస్తు చేసుకోగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ విద్యార్థి కూడా పరీక్ష రాయకపోవడం విశేషం.

Posted Date : 29-09-2020 .