• facebook
  • whatsapp
  • telegram

ఐవైఆర్‌సీలో విద్యార్థి ప్రతిభ

సూర్యాపేట (ఎంజీరోడ్డు), న్యూస్‌టుడే: దక్షిణ కొరియాలో ఇటీవల ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఇంటర్నేషనల్‌ యూత్‌ రోబోటిక్స్‌ కాంపిటీషన్‌ (ఐవైఆర్‌సీ)లో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి సత్తా చాటాడు. అతను రూపొందించిన ‘ఫార్మింగ్‌ ఆటోమిషన్‌’ ప్రదర్శన మొదటి బహుమతి గెలుపొందింది. కిరణ్‌, సునీత ఎడుకుల్ల దంపతుల కుమారుడైన అశ్రిత్‌ ఎడుకుల్ల హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎఫ్‌ఐఐటీజేఈఈ వరల్డ్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ పోటీల్లో 15 దేశాలు పాల్గొన్నాయి. ఫార్మింగ్‌ ఆటోమిషన్‌ ద్వారా ఇంట్లో మొక్కల పెంపకానికి నేలను చదును చేయడం, విత్తనాలు చల్లడం, నేల స్వభావాన్ని పసిగట్టడం, వెలుతురు తక్కువ ఉన్న ప్రాంతంలో మొక్కలకు వెలుతురు వచ్చేలా ఆటోమేటిక్‌గా బల్బు ఆన్‌ కావడం, నేల పొడిగా ఉన్నప్పుడు నీరు పోయడం వంటివి తన ప్రదర్శనలో ఉన్నాయని అశ్రిత్‌ ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

Posted Date : 29-09-2020 .