• facebook
  • whatsapp
  • telegram

ఏడాది కాలానికి 227 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ వైద్యఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్‌ విధానంలో నియమించుకునే 227 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను 12 నెలల కోసం నియమించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ సెప్టెంబ‌రు 28న‌ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వీరిని ఆరునెలల కాలానికి నియమించుకోవాలనే ఉత్తర్వులను సవరిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ ఆదేశించారు.

Posted Date : 29-09-2020 .